చాలా మంది లాగే, బాగా కష్టపడి, ఎంతో సీరియస్ గా అమీర్‌పేట్ లో ఉన్న కంప్యుటర్ కోర్స్ లు అన్నిట్లో లెగ్ పెట్టి, ఫైనల్లీ ఒక జెన్యూన్ ఫేక్ సర్టిఫికెట్ సాధించగలిగా. ఇంటర్వ్యూ పానెల్ కూడా మా అమీర్‌పేట్ బాచ్ కావడం మరియు నేను ఇంటర్వ్యూ రూం లో పావలా కి రూపాయి యాక్షన్ చేయడం తో, నాకు ఒక ఎం ఎన్ సి లో అఫర్ లెటర్ రావడం, గవర్నమెంటు స్కూల్ లో ఆడ్మిషన్ దొరికినంత ఈజీ అయిపోయింది.
ఒక డెవలప్మెంట్ ప్రాజెక్త్ కి నన్ను అర్పించారు. నా పక్క క్యూబికల్ లో ఫంజాబి పాప పింకీ ఉండెది. సన్ జావా ఎ పి ఐ లో ఉన్న క్లాసెస్ కంతె ఈ పాప కి ఉండె సన్ గ్లాసెస్ ఎక్కువ. అంబాని రేంజ్ పాప కి నాలాంటి డంబ్ ని తో రిలేషన్ పెట్టుకుంటే మనకు సెట్ అవ్వదు అని డిసైడ్ అయ్యి, లోకల్ గర్ల్ మహాలక్ష్మి తో పరిచయాలు పెంచుకొవడం స్టార్ట్ చేసా. గూగుల్ ఎర్త్ లో కూడా కనపడని ఊర్లో పుట్టి పెరిగిన మహాలక్ష్మి కి, ఎన్ని లక్ష్మి గనపతి ఫిలింస్ చూసినా తన ఇంగ్లిష్ మాత్రం అంతంత మాత్రమే . అందుకే క్లైంట్ కాల్స్ లో తారకరత్న సినిమా లాగా, అలా వచ్చి ఇలా వెల్లిపొయేది. కాల్ అయిన తరువాత ‘భాగి భాగి’ (ఎస్, నా పేరు భగీరధ్) అని టచింగ్ గా పిలిచి ఏ మాత్రం ఎంబర్రాస్‌మెంట్ లేకుండా రిక్వైర్మెంట్ ఫుల్ గా చెప్పించుకునేది. ఓ స్టెప్ ముందుకేసి నేనూ తనని మహి అని పిలవడం మొదలు పెట్టా.
శ్రీశాంత్ లాగా అర్థం లేకుండా ఆవేశపడే మా పి.ఎల్ యాద్గిరి, పింకీ తో వింక్ చేస్తూ జంకీ కబుర్లు చెప్తూ టైం పాస్ చేసే వాడు. సైకో కి ఎక్కువ, సాడిస్ట్ కి తక్కువ ఐన వీడికి, రిక్వైర్మెంట్ అర్థం చెస్కోకుండా టెస్ట్ కేసెస్ రాయడం ఒక హబీ. వీడు రాసిన కోడ్ కి చాలా సార్లు వెబ్ సర్వర్ క్రాష్ ఐంది. ఇంత జరిగినా, బాలక్రిష్ణ సినిమాలు తియ్యడం ఆపలెదు, యాద్గిరి కోడింగ్ చెయ్యడం ఆపలేదు.
టీం మీటింగ్స్ లో పింకీ, ఐ7 ప్రాసెసర్ లాగా చాలా ఫాస్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాదేసేది. నేను స్కూల్ లొ ఎప్పుడూ ఔట్‌స్టాండింగ్ (క్లాస్ బయట నిలబెట్టే వారు) అండ్ బి.టెక్ లో ఔట్‌గోయింగ్ (బంక్ కొట్టి బయట తిరిగే వాడిని), సో అంతగా ఇంగ్లీష్ రాకపోయినా, ఏదొ వాజ్‌పేయ్ స్టైల్ లో ఆగి ఆగి మాట్లాడే వాడిని. మహి మాత్రం, తెలుగు సినిమా హీరొయిన్ లా ‘సో’, ‘బట్’ , ‘యా’ తెగ యూజ్ చేస్తూ, ఇంగ్లీష్ లో టెన్సెస్ తొ సంబంధం లేకుండా, చాలా టెన్స్ అవుతూ ఏదో వాగేది. యాద్గిరి ఒక అప్పొజిషను పార్టీ లాంటి వాడు. ప్రతి మీటింగ్ లో టీం ని బ్లేం చేస్తూ మాతో గేం ఆడుకోడం వీడి హాబిట్. రోశయ్య అన్నీ హై కమాండ్ కి వదిలేసినట్టు, యాద్గిరి అన్ని డెసిషన్స్ పింకీ కే వదిలే వాడు.
ఓ సారి రామాయణం మూవీ కి వెల్లి, స్టొరీ రొటీన్ గా ఉందని ఇంటర్వెల్ లో బయటకొచెసిన యాద్గిరి కి బాగా ఆకలేసి ఇడ్లీ లో మజ్జిగ నంచుకుని తిన్నాడు. ఇది చూసి తత్తుకోలేకపొయిన హోటల్ ఓనర్ అక్కడికి అక్కడె బకెట్ తన్నేసాడు. ఐ పి సి లో ఇలాంటి హత్య కి ఏ సెక్షన్ లేకపోవడం తో యాద్గిరి బయటపడ్డాడు.
బాయిల్ లా ప్రాక్టికల్ గా నా మీద ప్రూవ్ అయింది. వర్క్ ఫ్రెజర్ పెరగడం తో నా బాడీ వాల్యుం తగ్గింది అండ్ నా మీద మహి కి సింపథి పెరిగింది. నా కష్టం చూసి ఎంతో ఇష్టం తో నా డెస్క్ దగ్గరకొచి బిస్కట్ లు తినిపించేది . ఆ డస్కీ కల్లల్లొకి చూస్తూ ఉంటే, విస్కీ తాగినంత కిక్ ఎక్కేది, బట్ ఎందుకు లే అని రిస్క్ తీస్కొలేదు. ఇండియా జిడిపి రేట్ లాగా నెమ్మదిగా మా ఇంటిమసీ పెరిగింది.
డెవలప్మెంట్ ఫేస్ లో కి మూవ్ అయింది ప్రాజెక్ట్. నీ మీద లవ్ డెవలప్ చేస్కున్నాను అని చెప్పింది మహి ఒక రోజు. లాంగ్ టర్మ్ ఆన్సైట్ వచ్చినంత హాప్పీ గా ఫీల్ అయ్యా. బట్ ఇంత షార్ట్ టర్మ్ లో ఇదంతా ఎలా జరిగిపోయింది అని అడిగా. ఎరిక్ సీగల్ ‘లవ్ స్తొరీ’ రేంజ్ నేర్రేషన్ ఇచ్చి, ‘ ఐ నీడ్ యు’ అంది. బట్ ఐ కాంట్ ఫీడ్ యు అని చెప్పలేక, మహి నెక్ మీద ఒక పెక్ పెట్టి సింబాలిక్ గా అక్నలెడ్జ్మెంట్ ఇచా.
బొనాలకి యాద్గిరి అండ్ ఫామిలీ, తెలంగాణా టూర్ ప్లాన్ చేస్కున్నారు. పింకీ ని మేనేజ్ చెయ్యమని 2 వీక్స్ వెకేషన్ కి చెక్కేసాడు యాద్గిరి. ఇదే ఛాన్స్ అని నేను, మహి .. ఆఫీస్ నుంచి ఎర్లీ గా జంప్ అయ్యి ఇంజన్ కాలిపోయేదాకా బైక్ మీదా, కడుపు పగిలే దాకా రెస్టారెంట్స్ లో, బ్లాడర్ లీక్ అయ్యేదాకా కాఫీ షాప్స్ లో, ఉన్న మూవీస్ అన్నీ కవర్ అయ్యేవరకు మల్టిప్లెక్సెస్ లో గడిపాము. ఇంటికెల్లి ఫొన్ లో కంటిన్యూ చేసేవాళ్ళం . నష్టాల్లో ఉన్న ఎయిర్టెల్ ని గట్టెక్కించింది మేమే. మేమే కనుక ఫొన్ లో బాటరీ డిస్చార్జ్ అయ్యేంత వరకు, రోజు కి 10 గంటలు మాట్లాడకపోయి ఉంటే ఈ రోజు ఎయిర్తెల్ ఇలా ఉండేదే కాదు.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో రోమియో-జూలియట్ డ్రామా కి నన్ను, మహి ని నామినేట్ చేసారు. పాత్ర లో బాగా జీవించా నేను. ఎంత గా అంటే పక్క ప్రాజెక్ట్ గీత నా ఫోన్ నంబర్ అడిగేంత . ‘నీ భ్రమ కాకపొతె అది జస్ట్ డ్రామా’, అని చెప్పా. అయినా సరే గీత నాకు గీత వేసింది. నేను గీత తో గీత దాటిపోయి మాట్లాడడం చూసిన మహి, నాకు గీతోపదెషం చేసి మా ఇద్దరి మద్య ఒక అడ్డ గీత వేసింది. దాంతో గీత ఒక ఇన్ఫినైట్ లూప్ లొ పడిన వేరియబుల్ లాగా నలిగిపోఇంది. మహాలక్ష్మి కి మహా పొసెసివ్‌నెస్ అని మహా హాపీ గా ఫీల్ అయ్యా.
పింక్ గా ఉండె పింకీ ఎల్లో గా అయిపోయింది. జాండీస్ అని చెప్పాడుట డాక్తర్. “ఐ విల్ బి ఆఫ్ 4 ఎ వీక్. యు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాజెక్ట్” అని ఓ రోజు ఎస్సెమ్మెస్ చేసింది. 1 వీక్ ఉంది కోడ్ డెలివరీ కి. మహి కి రిక్వైర్మెంట్స్ చెప్పే టైం లో జేంస్ కామెరూన్ ఒక సినిమా తీయగలడు.
మిగిలింది నేనే కావడం తో, కోడ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసా. ఇంతకు ముందు ఎప్పుడు తెలియని రన్‌టైం ఎర్రర్స్, జె వి ఎం నా ద్వారా తెలుసుకుంది. పార్సర్స్ తో పరిచయం చెస్కున్నా, అర్రేస్ తో ఆడుకున్నా, డేటాటైప్స్ తో డాన్స్ చెయించా, జార్ ఫైల్స్ తో కార్ లో షికార్ కు వెల్లా. అపోలో ఫార్మసీ లాగా 24 గంటలు పని చేసి, లాంగ్ డేటాటైప్ లా ఉండే నేను, బైట్ డేటాటైప్ లా అయిపోయా.
ఇంక కష్టపడింది చాలు, రెస్ట్ తీస్కోడం బెస్ట్ అనిపించి కోడ్ ని టెస్ట్ చెయ్యమని మహి కి ఇచ్చా. స్ట్రాటజిక్ టైమవుట్ లేని టి 20 మ్యాచ్ అంత క్విక్ గా కంప్లీట్ చేసింది టెస్టింగ్.
అలా...
కోడ్ ని క్లైంట్ మొహాన కొట్టి డార్క్ అయ్యే దాకా పార్క్ లో ఉండి ఫోర్క్ అనే రెస్టారంట్ కి వెళ్ళాం. క్రెడిట్ కార్డ్ గీకితే “ArrayIndexOutOfBoundsException" వచ్చిందని, కాష్ పే చేసి, రాష్ గా బైక్ మీద ఆఫీస్ కి రిటర్న్ వచ్చాం..
మెయిల్‌బాక్స్ ఓపెన్ చేసి, క్లైంట్ నుంచి వచ్చిన మెయిల్ చదివా. రాం గోపాల్ వర్మ సినిమా కంటే ఎక్కువ వయొలెంట్ గా ఉంది మెయిల్. సమ్మరీ ఏంటంటే, మేము డెవలప్ చేసిన కోడ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో బగ్ ఇంట్రడ్యూస్ చేసింది అండ్ డేటాబెస్ మొత్తం క్రాష్ అయింది అని.. టెస్టింగ్ చేసిన మహి డార్లింగ్ ని పిలిచి చుపించా మెయిల్. నాకేం తెలీదంటూ సి డబ్ల్యు జి స్కాం చేసిన సురేష్ కల్మాడి అంత ఇన్నోసెంట్ గా మొహం పెట్టింది . ఇంతలో క్లైంట్ కాల్ చేసి ఎస్కలేషన్ రైస్ చేస్తా అన్నాడు. ఇంటర్‌పోల్ ‘మోస్ట్ వాంటెడ్’ లిస్ట్ లో నా పేరు ఆడ్ అయింది అన్నంత భయమేసింది. మాట్రిక్స్ సినిమా మళయాలం లో చూసినట్టు గా అంతా కన్ఫ్యూజన్ గా అనిపించింది.
నెక్స్ట్ డే యాదగిరి గుట్ట నుంచి గుండు కొట్టించుకుని వచ్చిన యాద్గిరి గుండె పగిలింది ఆ బగ్ మెయిల్ చదివి. అదే రోజు రిటర్న్ అయ్యి వచ్చిన పింకీ, బక్క చిక్కిన కె సి ఆర్ లా అయిపొఇంది. యాద్గిరి నాతో పర్సనల్ గా మట్లాడాలి అని రూం లోకి రమ్మన్నాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి , మహి ఇన్వాల్వ్మెంట్ కూడ ఉంది ఇందులో అని చెప్పా.
రూం లోకి వెళ్లగానే “వాట్స్ ద రీసన్ ఫర్ బగ్, బగ్గీరధ్ ?” అని అడిగాడు. బిక్క మొహం తో మహి వైపు దొంగ చూపులు చూసా. బట్ అది మాత్రం నేనే దొంగ అని ఏదేదో చెప్పి కన్విన్స్ చేసేసింది యాద్గిరి ని. నన్ను ప్రాజెక్ట్ నుంచి దొబ్బెయ్యమని యాద్గిరి ఆర్దర్ చేసాడు. చిదంబరం తెలంగాణా స్టేట్ ని డెక్లేర్ చేసినట్టు జోక్ చెయ్యట్లేదు కదా అని అడిగా. నా ఎంప్లాయీ డీటైల్స్, డేటాబేస్ లో లేకుండా చేస్తా అని ముద్దు గా చెప్పాడు. ఈక్కడ సైలెన్స్ మైంటైన్ చెయ్యకపోతె వయొలెన్స్ అయ్యేలా ఉందని... బయటకొచ్చేసా..
ఆ బగ్ నన్ను బగ్గీరధ్ ని చేసింది. మహి తో రిలేషన్ finalize() చేస్కున్నా. అలా కొంత కాలం గడిచింది. ఇన్ని జరిగినా, సిగ్గు లో సి కూడ లేకుండా చిరంజీవి పాలిటిక్స్ నుంచి టాలీవుడ్ కి రీ-ఎంట్రీ ఇచ్చినట్టు, వన్ ఫైన్ డే, లవర్ బాయ్ ఇమేజ్ లో కి నేను రీ-ఎంట్రీ ఇచ్చా. గీత కి గీత వేస్కుందాం అని ఫిక్స్ అయ్యా. నల్ స్త్రింగ్ లాగా తన దగ్గరికి వెళ్తే బాగోదని, ఫ్లవర్స్, గిఫ్ట్ లు కొన్నా తన కోసం. గీత ని ఇన్వోక్ చెసా (అదే, కాల్ చేసా). గీత కూతురు సీత ఎత్తింది . ‘పబ్లిక్’ గా ఉండే గీత ‘ప్రొటెక్టెడ్’ అయిపోయిందని తెల్సుకున్నా .
ఫోన్ పెట్టేసా ..
ఒక్క సారి గిర్ర్ర్ అని ఫ్లాష్‌బాక్ లోకి వెల్లి, బగ్గీరధ్.compareTo(భగీరధ్) చేసి చూసా. 64-బిట్ ఒ ఎస్ లా ఉండే నేను, దాస్ లా అయినందుకు కారణం ఐన అందర్ని (ఇంక్లూడింగ్ నన్ను) వోల్ హర్టెడ్ గ తిట్టుకున్నా.
అలా ఇంప్లిమెంట్ చేయని ఇంటర్ఫేస్ లా అయిపొయింది నా లైఫ్.
-- నాకు ఈ ఫార్వర్డ్ ఇంగ్లీష్ లో వస్తే.. నేను తెలుగు లోకి ట్రాన్స్‌లేట్ చేసి పెడ్తున్నా...
Wednesday, December 22, 2010
Thursday, December 16, 2010
Amazing Paper artwork
Psaligraphy
Psaligraphy - the art of papercutting - requires time. Both when it comes to creation and experience of the work of art. Contrary to almost everything else in the world today, psaligraphy is a slow art. It takes time to master, plan and perform it.
“My heart and soul are at peace when I have the scissors in hand and the paper dances between the blades. If my scissors can manage to make you stop and wonder for just one instant, I will be happy” – Psaligraph Karen Bit Vejle (born 1958)
Project - H.C. Andersen
Misc
Subscribe to:
Posts (Atom)




























